ఒక్క సినిమా పడితేనా...అనుష్కా లాంటి స్టార్ ఐపోతారు..
on Jul 17, 2025
దివి అంటే ఒకప్పుడు ఎవరికీ తెలీదు కానీ బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లొచ్చాక దివి అంటే ఎవరో ఆడియన్స్ కి తెలిసింది. ఐతే బిగ్ బాస్ తర్వాత అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అలాగే జిమ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని మూవీస్ లో కనిపించింది. లంబసింగి మూవీలో నటనకు స్కోప్ ఉన్న రోల్ లో నటించింది. అలాగే మహేష్ బాబు మూవీ మహర్షిలో, లూసిఫర్ లో గుర్తుండిపోయే రోల్స్ లో కనిపించింది. ఇక హరికథ మూవీలో ఐతే చాల సైలెంట్ గా ఉండే ఒక పాత్రలో ఒదిగిపోయింది. దివి నాట్యం చేసిన "నెమలి" అనే ఒక ఆల్బం ఫుల్ సాంగ్ జులై 18 న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సాంగ్ కి సంబందించిన కొన్ని చరణాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
దివి ఐతే "మనలోని బలాన్ని, మన స్వేచ్ఛను, మన సొంత నటనను బయటకు చూపించడం నిజంగా ఒక వేడుకలాంటిది. నెమలి అనేది ఒక లిరికల్ సాంగ్ కాదు, అదొక లిరికల్ పోయెమ్ " అంటూ పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే దివి డాన్స్ కి ఫిదా ఐపొతూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఐతే " మీకు ఒక్క పెద్ద సినిమా పడితే మీరు అనుష్క గారంతా పెద్ద స్టార్ అవుతారు నిజంగా" అంటూ చెప్పారు. ఇంకా కొంతమంది నెటిజన్స్ ఐతే "సాంగ్ సూపర్, శారీలో సూపర్, బ్యూటిఫుల్ దివి మేడం, మీకు సినిమా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు అర్ధం కావడం లేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2021 లో వచ్చిన "సిలక ముక్కుదాన" అనే మ్యూజిక్ ఆల్బమ్ చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
